రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై రేషన్ షాపుల్లో బియ్యం, ఉప్పు, పప్పులతో పాటు విభిన్న రకాల పోషక ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది. నిత్యావసరాలు సహా మొత్తం 3500 ఉత్పత్తులను విక్రయించనున్నట్లు వెల్లడించింది. లబ్ధిదారులకు పోషకాలు అందించడంతోపాటు రేషన్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెబుతోంది. తొలుత పైలట్ ప్రాజెక్ట్ గా ఈ స్కీం ప్రారంభించినట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో 4 రాష్ట్రాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టనున్నామని అన్నారు. తెలంగాణతో పాటు ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 60 రేషన్ షాపులను ఎంపిక చేశామని తెలిపారు.
పేదలకు మోదీ సర్కార్ అదిరే శుభవార్త చెప్పింది..
