వచ్చే నెల నుంచి రుణమాఫీ

poguleti-22.jpg

జులై నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పేదలకు ఇచ్చిన హామీలపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రుణమాఫీ చేయడాన్ని తట్టుకోలేక విపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. రూ.31 వేల కోట్లతో రుణాలు మాఫీ చేసి అన్నదాతల ముఖాల్లో ఆనందం తెస్తామని చెప్పారు. త్వరలోనే రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి వివరించారు.

Share this post

scroll to top