ఏపీలో నిత్యం ఏదో ఒక సమస్యతో రాజకీయ మంటలు మండుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో అధికార, విపక్షాల మధ్య విమర్శలు తార స్థాయికి వెళ్తున్నాయి. ఒకరిపై ఒకరు పెట్టుకునే పోస్టులకు హద్దులు కూడా ఉండవు. ఇప్పుడు మరోసారి రెండు పార్టీల మధ్య పోస్టర్ల యుద్ధం జరుగుతోంది. టీడీపీ, వైసీపీ పెట్టిన పోస్టర్స్ చర్చనీయాంశంగా మారాయి.
సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్ ప్లోజ్ చూస్తూనే ఉండాలంటూ టీడీపీ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ కు కౌంటర్ గా వైసీపీ కూడా బిగ్ రివీల్ ట్రూత్ బాంబ్ డ్రాపింగ్ అని పోస్టర్ విడుదల చేసింది. దీంతో ఏం జరగబోతోంది అని ప్రజల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది.