ఏపీలో బలోపేతం కావాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం పొత్తులతో ముందు సాగుతున్నా రానున్న రోజుల్లో బలోపేతం కు ఇదే సరైన సమయంగా భావిస్తోంది. ఏపీకి కేంద్రం అందిస్తున్న సహకారం పైన పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పార్టీ నేతలకు ఢిల్లీ నాయకత్వం దిశా నిర్దేశం చేసింది. ఈ నాలుగు నెలల కాలంలో కేంద్రం ఏపీ కోసం తీసుకున్న నిర్ణయాలపైన ప్రత్యేకంగా మార్గ నిర్దేశం చేస్తున్నారు. ఇటు పురందేశ్వరి సైతం కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ అన్ని రాజకీయ పార్టీలకంటే భిన్నమైనదని చెప్పుకొచ్చారు. గతంలో 11కోట్ల సభ్యత్వాన్ని ఆరునెలలో చేసామని, ఇప్పుడు 45 రోజుల్లో 22 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేసామని పురందేశ్వరి తెలిపారు.
ఏపీలో బీజేపీ కొత్త గేమ్
