సద్దుల బతుకమ్మ దసరా పండుగ నేపథ్యంలో ప్రజలు గురువారం పట్టణం నుంచి పల్లెబాట పట్టారు. హైదరాబాద్ మహానగరం క్రమంగా ఖాళీ అవుతోంది. లక్షల సంఖ్యలో ప్రయాణికులు సొంతూళ్లకు వెళుతున్నారు. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నాయి. అవసరమైతే రద్దీకి అనుగుణంగా సర్వీసులను పెంచేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మరిన్ని అదనపు సర్వీసులు నడపాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు. పిల్లాపాపలతో ఊరెళ్లాలంటే గంటల కొద్దీ రోడ్లపై నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు.
పల్లెబాట పటిన పట్నం జనం..
