టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. ఈ కేసులో వైసీపీ నేతలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు దేవినేని అవినాశ్, జోగి రమేశ్ లకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. అలాగే అవినాశ్, జోగి రమేశ్ లు తమ పాస్ పోర్టులను 48 గంటల్లోగా హైకోర్టుకు అప్పగించాలని ఆదేశించింది. ఇద్దరూ విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు సూచించింది.
టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో దేవినేని అవినాశ్, జోగి రమేశ్ లకు సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. ఈ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న వారంతా కూడా తమ పాస్ పోర్టులను వెంటనే దర్యాఫ్తు అధికారికి అప్పగించాలని ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోసం దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పాస్ పోర్టులు సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది కనుక ఎటువంటి అరెస్టులు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.