వైసీపీ రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి ఇవాళ భారీ ఊరట లభించింది. వైసీపీ హయాంలో చోటు చేసుకుందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ కు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు మిథున్ రెడ్డికి ఊరటనిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి గతంలో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఈ పిటిషన్ లో ఆధారాల్ని సమగ్రంగా పరిశీలించలేదని ఆభిప్రాయపడింది. దీంతో మరోసారి తాజాగా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్..
