నగరిలో జరిగిన దళితుల దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. దళితులను ఊర్లో రానివ్వమని, తిరగకూడదని, ఊరి నుండి వెలివేయాలని హుకుం జారీ చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులు దళితులపై భౌతిక దాడులు చేసి, వారి ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా, బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టడం ఏ విధమైన న్యాయం? అంటూ రోజా ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వంశీ, కిరణ్, పురుషోత్తంలను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నారా లోకేష్‌ను ఉద్దేశించి రోజా మాట్లాడుతూ మీ నాయకత్వానికి గౌరవం పెరగాలంటే, ఇలాంటి ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. కానీ, అధికారం ఉందని దళితులపై దాడులు చేయడాన్ని మానవజాతి క్షమించదని, అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని ఆవిడ అన్నారు.