సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలం చౌదర్‌పల్లె గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడి భూమి కబ్జా గురైంది. స్వయంగా స్థానిక వీఆర్వో సోదరుడే తన భూమిని కబ్జా చేశాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆర్డీవో, కలెక్టర్లు పట్టించుకోవడం లేదని జవాన్ వాపోయాడు. నన్ను, నా తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని, తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. తాను దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే, సొంత ఊరిలో నా భూమి కబ్జా దారుణమని ఆవేదన చెందారు. దయచేసి తమకు న్యాయం చేయాలని రోధిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఈ విషయంపై దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ ను అభ్యర్థించారు. మన సరిహద్దులను కాపాడుతున్న ఒక సైనికుడికి ఇలాంటి సంఘటన ఎదురవడం దారుణం అని హరీష్ రావు పేర్కొన్నారు.
భారత జవాన్ భూమిని కబ్జా..
