ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండటానికి సమతుల్య, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం ఆరోగ్యకరమైన, ఇంట్లో తయారు చేసిన, తక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తినడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే గింజలు, విత్తనాలు కూడా వ్యక్తి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయంటున్నారు. వీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మీరు ఈ విత్తనాలను పచ్చిగా లేదా నానబెట్టి తినవచ్చు.
పొద్దుతిరుగుడు విత్తనాలు..
పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ ఇ, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి కణాలను రక్షించడంలో అలాగే రోగనిరోధక వ్యవస్థ, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
చియా, అవిసె గింజలు..
బరువు తగ్గడం కోసం చాలామంది తమ ఆహారంలో చియా విత్తనాలను చేర్చుకుంటారు. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. చియా, అవిసె గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైనవిగా పరిగణిస్తారు.
గుమ్మడికాయ గింజలు..
గుమ్మడికాయ గింజల్లో జింక్, మాంగనీస్ గొప్ప మూలం, ఇది రోగనిరోధక పనితీరు, చర్మం, ఎముకలు, జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం.
నల్ల బీన్ గింజలు..
నల్ల బీన్ గింజలను నల్ల నువ్వులు అని కూడా అంటారు. ఇందులో ఎర్ర రక్త కణాలు, ఎముకలు, రక్త నాళాలు ఏర్పడటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అదనంగా ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.