విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో గండి బాజ్జీ పీలా గోవింద్, బైరా దిలీప్ ముందు వరుసలో ఉన్నారు. అయితే, ఈ రోజు సాయంత్రం లోగా టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థిని ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంతో ఈ రోజు వైసీపీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ వేయనున్నారు.
శాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి వైపే కూటమి మొగ్గుచూపుతుందన్న ప్రచారం సాగుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ రోజు ప్రకటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 30న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. వైసీపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అనుకున్నట్టుగా జరిగితే బొత్సను ఢీకొనబోతున్నారు బైరా దిలీప్ చక్రవర్తి. దాదాపు బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు అయినట్టు వినిపిస్తోంది.