పిఠాపురంలో వర్మ ఇపుడు అధికారంలో పార్టీ ఉండటంతో తన చొరవ చూపిస్తున్నారు. ఆయనకు నియోజకవర్గం సమస్యలు అన్నీ అవగాహన ఉంది. దాంతో ఆయన అధికారులతో కలసి పనులు చేయిస్తున్నారు. అలా వర్మ తన హవాను చాటుకుంటున్నారు. ఇది జనసైనికులకు గిట్టడం లేదు అని అంటున్నారు. జనసైనికులు కూడా తమ మాటే పిఠాపురంలో నెగ్గాలని చూస్తున్నారు. మొత్తం మీద చూస్తే వర్మ విషయంలో ఒక రకంగా జనసేన లోకల్ లీడర్స్ కాస్తా ఎడం పాటిస్తున్నారు. టీడీపీ నేతలు కూడా అంతే దూరం పాటిస్తున్నారు. దాంతో పిఠాపురం నియోజకవర్గంలో కూటమి పార్టీలు రెండుగా చీలి కత్తులు దూస్తున్నాయని అంటున్నారు.
జనసేనకు పవన్ కి ఇది పర్మనెంట్ సీటు అని పవన్ రాజకీయల్లో ఉన్నంతవరకూ పిఠాపురం వదలరని అంటున్నారు. దాంతో వర్మకు ఏ రకంగానూ రాజకీయంగా ఎలివేషన్ లేకుండా పోతోంది అని ఆయన వర్గం మధన పడుతోంది. ఎమ్మెల్సీ సీటు కూడా వర్మకు దక్కలేదు. మరి ఫ్యూచర్ లో వస్తుందో రాదో తెలియదు. దాంతో ఆయన తన అనుచరులు తన క్యాడర్ ని కాపాడుకోవడానికి గట్టిగానే తిరుగుతున్నారు. ఆయన చంద్రబాబుని పొగుడుతున్నారు. బాబు నాయకత్వం గ్రేట్ అంటున్నారు. మొత్తానికి చూస్తే ఎన్నికల్లో అంతా కలసి ఒక్కటిగా పనిచేసిన టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే ఈ విధంగా చీలిపోవడం ఒకరి ఆధిపత్యానికి వేరొకరు గండి కొట్టాలని చూడడం చూస్తే టాక్ ఆఫ్ ది టౌన్ గా పిఠాపురం నిలుస్తోంది. పిఠాపురం రాజకీయాన్ని సెట్ చేయకపోతే రానున్న రోజులలో ఎలా ఉంటుందో తెలియదు అని అంటున్నారు.