ఒంగోలు మహానాడులో తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేన పార్టీ మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. టిడిపి నేత జనార్ధన్ అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య బహిరంగంగానే విమర్శల దాడి కొనసాగుతోంది. మొన్నటి వరకు వైసిపి లో ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి టిడిపి నేత జనార్ధన్ ను చాలా ఇబ్బంది పెట్టినట్లు చెబుతున్నారు. అయితే తాజాగా జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేరడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కూటమిలో సభ్యులు కావడంతో ఈ ఇద్దరి మధ్య మాత్రం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి మహానాడులో హాట్ కామెన్స్ చేశారు టిడిపి నేత జనార్ధన్. గతంలో చేసిన తప్పులను మరిచి ఏదో ఒక పార్టీ అంటూ జనసేనలో చేరాడని చురకలు అంటించారు జనార్ధన్. ఒకరోజు ఎమ్మెల్సీ ఆ తర్వాత మరో రోజు నాలుగు జిల్లాలకు ఇన్చార్జి అంటూ వేషాలు వేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే జనార్ధన్ చేసిన వ్యాఖ్యలపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంకా స్పందించలేదు.
బాలినేని పరువు తీసిన టీడీపీ నేత జనార్దన్..
