రేపు సాయంత్రంలోగా రైతు రుణమాఫీ రైతుల ఖాతాల్లో రూ.లక్ష వరకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 11 గంటలకు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలన్నారు. రుణమాఫీ నిధుల వరకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లో రూ.లక్ష జమ చేస్తామన్నారు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను గతంలో వ్యక్తిగత, ఇతర రుణమాఫీకి వినియోగించలేదు బ్యాంకర్లు రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా, 70 లక్షల మంది రైతులకు రుణాలు ఉన్నాయని తెలిపారు. వీరిలో 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవని.. వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీ చేస్తామన్న రైతువేదికలకు రైతులను తీసుకొచ్చి ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆ ఆనందాన్ని వారితో పంచుకోవాలి. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారి అందుబాటులో ఉంటారని అన్నారు.
రేపే రైతుల ఖాతాల్లోకి సొమ్ము..
