ఏపీలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు..

cbn-15.jpg

78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. గల్లీ గల్లీలో తిరంగా జెండా ఎగురుతోంది. దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటీష్ వారి చెరలోనే మగ్గిపోయిన భారత జాతికి ఇవాళే విముక్తి లభించింది. బ్రిటీషర్లు పెట్టిన చిత్ర హింసల నుంచి బయటకు రావాలనే ధృఢ సంకల్పంతో 1857లో సిపాయిల తిరుగుబాటుతో స్వాతంత్ర్యోద్యమ పోరాటం ప్రారంభమైంది. 90 ఏళ్ల పాటు అలుపెరగక భారతీయులంతా పోరాటం సాగించారు. ఎక్కడికక్కడ ఉద్యమాలు, ఆందోళనలు, హర్తాళ్లతో జనం తమ పవరేంటో చూపించారు. నాయకులు సైతం ఎవరికి వారు తమకు తోచినట్టుగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. తద్వారా జనాలను నడిపించారు. మొత్తానికి 1947 ఆగస్ట్ 15న మన దేశానికి స్వాతంత్ర్యం లభించింది. నేడు నాయకులంతా దేశ ప్రజానీకానికి స్వాతంత్ర శుభాకాంక్షలు చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం ప్రజానీకానికి ట్విటర్ వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Share this post

scroll to top