మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వివాదస్పద వ్యాఖ్యలు..

mohan-09.jpg

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతా మోహన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భక్తులను ఎవరు తోయలేదని, సుదూరం నుంచి ఏమి తినకుండా కిక్కిరిసిన క్యూలైన్లలో వేచి ఉండి బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోయి వారంతట వారే సొమ్మసిల్లి పడిపోయారన్నారు. తొక్కిసలాటలో టీటీడీ వైఫల్యం ఏమి లేదన్నారు. తిరుమలలో తొక్కిసలాట జరగలేదని, గంటల తరబడి ప్రయాణం చేసి ఏమి తినకుండా ఆకలితో భక్తులు లైన్లో నిలబడటంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వం, టీటీడీకి, ఆధికారులకు సంబంధం లేదన్నారు. గతంలో కంటే ఇప్పుడు టీటీడీ మెరుగ్గా పనిచేస్తుందన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయారు. ప్రభుత్వం మృతులకు ఒక్కొక్కరికి రూ.25లక్షల పరిహారం సైతం ప్రకటించింది.

Share this post

scroll to top