జగన్ కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ ఆ పార్టీకి రాజీనామా చేసేలా కనిపిస్తున్నాడు. ఇవాళ మధ్యాహ్నం వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ప్రెస్ మీట్ నిర్వహించనున్నాడు. ఈ తరునంలోనే వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకట రమణ రాజీనామా చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి దూరంగా ఉంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ వైసీపీని వీడ తారని గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. గతంలో టీడీపీ నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా పని చేసిన వెంకట రమణ ఆ తర్వాత వైసీపీ కండువా వేసుకున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ టీడీపీ లేదా జనసేన పార్టీల వైపు చూస్తున్నారట. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ఆ మేరకు ఆఫర్ కూడా వచ్చిందని సమాచారం.
జగన్ కు మరో షాక్
