ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం కల్కి 2898 ఏడీ. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ హైప్ నెలకొంది. భారతీయ పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నట్లు గతంలో డైరెక్టర్ నాగ్ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడీ నేడు థియేటర్లలో విడుదలైంది. కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాలను పరిచయం చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన అద్భుత మాయ చిత్రానికి ఉదయం నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఇందులో కమల్ హసన్, అమితాబ్, దీపికా, శోభన, దిశా పటానీ, మాళవిక నాయర్ కీలకపాత్రలు పోషిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో ఐదుగురు సినిమాలో కనిపించారు. మృణాల్, డైరెక్టర్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కెవి, ఫరియా అబ్దుల్లా కనిపించారు.
బాక్సాఫీస్ కింగ్.. థియేటర్స్ వద్ద ప్రభాస్ మేనియా కల్కి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
