నారా లోకేష్ నువ్వు పిల్లాడిగా ఉన్నప్పుడు మీ నాన్న హైదారాబాద్ లో కట్టించిన పార్టీ ఆఫీస్ ఏంటి ఇది పూరిపాక, రేకుల షెడ్డా లేదంటే ఒకే గది ఉన్న స్లాబా.. దీని చరిత్ర ఏంటి? ఈ పార్టీ ఆఫీస్ స్థలాన్ని ట్రస్ట్ కి బదిలీ చేసుకున్నారు రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు.. 2019 ఎన్నికలకు వెళ్ళే నెల ముందు జనవరిలో కూడా 3 ఆఫీసులకి స్థలం లీజుకి తీసుకున్నారు.’ అంటూ టీడీపీ ఆపీస్ ఫోటో షేర్ చేశారు. అయితే పేర్ని నాని ట్టీట్‌కు టీడీపీ ఘాటుగా స్పంధించింది. ‘వైఎస్ జగన్ నువ్వు పదో తరగతిలో లాగులు వేసుకునే టైంలో, ప్రశ్నాపత్రాలు దొంగతనం చేసి దొరికిపోయావు. నీ స్నేహితులు చక్కగా చదువుకుని బాగుపడ్డారు. నువ్వు మాత్రం ఘరానా దొంగవి అయ్యావు. నీకు, నీ స్నేహితులకు ఎంత తేడా ఉందో, మేము అనుమతులతో కట్టిన రాష్ట్ర పార్టీ ఆఫీసుకు, నువ్వు అనుమతులు లేకుండా, అక్రమంగా, కబ్జా చేసి, ప్రజల డబ్బుతో, 26 జిల్లాల్లో కట్టిన 26 ప్యాలెస్‌లకు అంత తేడా ఉంది.’ అంటూ టీడీపీ మండిపడింది. కాగా ఈ పోస్టులు చూసిన నెటిజన్స్ వైసీపీపై మండిపడుతున్నారు.
దానికి దీనికి అంత తేడా ఉంది మీకు అర్థమవుతుందా..
