విశాఖ గ్యాంగ్‌ రేప్ కేసులో కీలక విషయాలు..

gang-20.jpg

విశాఖలో విద్యార్థినిపై అత్యాచారం కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. ప్రేమ, పెళ్లి పేరుతో యువతికి దగ్గరైన ప్రియుడే ఆమెను మోసం చేశాడు. ఇద్దరూ ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలు తీసి ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ కు దిగాడు. వాటిని చూపించి అతడి స్నేహితులు సైతం లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత తమ కోరిక తీర్చాలని వారు వేధించడం, ప్రియుడు సైతం ఫ్రెండ్స్ కోరిక తీర్చాలని ఒత్తిడి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది. తండ్రి కాపాడి ప్రశ్నించడంతో విషయం బయటకొచ్చింది.

ఇదిలా ఉంటే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లా చదువుతున్న యువతిపై నలుగురు అత్యాచారం చేసి ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్స్‌లో రికార్డ్ చేసి బెదిరిస్తూ అనేకసార్లు మళ్లీమళ్లీ అత్యాచారం చేయడంతో సదరు యువతి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులు వంశీ, ఆనంద్, రాజేశ్, జగదీశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని హోం మంత్రి అనిత ఆదేశించారు.

Share this post

scroll to top