నా భార్యతో అనుక్షణం నరకం అనుభవించాను..

duvada-10-1.jpg

తన భార్య వాణిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియా సమాశంలో మాట్లాడుతూ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసినా, తనపై వాణి 24 గంటలూ విషం చిమ్మిందని వెల్లడించారు. రాజకీయ కాంక్షతోనే తనను వేధించిందని ఆరోపించారు. తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసిందని, ఆమెతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తన భార్య వెనుక మంత్రి అచ్చెన్నాయుడు ఉండి ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. తన ప్రాణానికి ఏం జరిగినా అచ్చెన్నాయుడిదే బాధ్యత అన్నారు.

ఎమ్మెల్యే కావాలని 25 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నా. ఈ ఎన్నికల్లో జగన్ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తనకు కూడా టికెట్ కావాలని నా భార్య అడిగారు. విడాకులు కోరుతూ జగన్ వద్దకు సైతం వెళ్లింది. ఎన్నికల తర్వాత విడాకులు ఇస్తానని చెప్పా. ఎన్నికల్లో నేను ఓడిపోయా. ఇండిపెండెంట్ పోటీ చేయాలని నా భార్య ప్రయత్నం చేశారు. నా పిల్లలు నన్ను శత్రువుగా చూస్తున్నారు. ఇద్దరిని డాక్టర్లను చేశా. ఏ లోటూ రాకుండా చూసుకున్నా. వివాదాలు రాకుండా ఆస్తులు సైతం ఇచ్చేశా. ఖర్చుల కోసం రూ. కోటిన్నర ఇచ్చా. కూతుళ్లలో నాపై వ్యతిరేక భావనను వాణి తీసుకొచ్చారు. నా ఇంటి వద్దకు వచ్చేటప్పుడు టీడీపీ మూకలను తీసుకొచ్చారు. నా భార్య ఆందోళన వెనుక మంత్రి అచ్చెన్నాయుడు ప్రోద్బలం ఉంది. నాపై అక్రమంగా కేసులు పెట్టాలని చూస్తున్నారు. అని దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Share this post

scroll to top