రాజమౌళి సినిమా ప్రారంభం అవుతుందంటే అంతకు ముందు కొన్ని నెలల నుంచే ఆ సినిమా హీరో బయట కనిపించడం తగ్గిపోతుంది. హీరో లుక్ రివీల్ అవుతుందని జక్కన్న ఆలోచన. కానీ SSMB29 మూవీలో మహేశ్ కు మాత్రం ఈ కండిషన్లు లేవు. సూపర్ స్టార్ స్వేచ్ఛంగా ఫంక్షన్లకు, బయటకు తిరుగుతూ ఉన్నాడు. దాంతో ప్రిన్స్ లుక్స్ కి ఫ్యాన్స్ పిచ్చెెక్కిపోతున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, మీసకట్టుతో మహేశ్ ను ఇప్పటి వరకు చూడని విధంగా తయ్యారు చేసి మహేశ్ తో జక్కన్న గట్టిగానే కొట్టబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి ప్రిన్స్ లుక్ విషయంలో ట్విస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పుడు మనందరం చూసే మహేశ్ న్యూ లుక్ నిజమైంది కాదట, సినిమాలో వేరే విధంగా కనిపిస్తాడని తెలుస్తోంది.
జక్కన్న ట్విస్ట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
