వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. కొందరు నేతల నోళ్లకు విశ్రాంతి లేకుండా పోయింది. ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తూ.. అప్పటి విపక్ష నేతలపై నిత్యం అభ్యంతరకర పదాలతో విరుచుకుపడేవారు. రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం.. ఓ పార్టీ విమర్శలకు మరో పార్టీ కౌంటర్ ఇవ్వడం దేశ వ్యాప్తంగా చూస్తుంటాం. కానీ ఏపీలో మాత్రం 2019 నుంచి 2024 మధ్య వైసీపీ (YSRCP) నేతలు రాజకీయ విమర్శలను పక్కనపెట్టి.. విపక్ష నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. తిట్లతో విరుచుకుపడేవారు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రజలు కోరుకుంటున్నది తిట్ల పురాణం కాదని.. అభివృద్ధి, సంక్షేమమని వైసీపీ నేతలకు తెలిసొచ్చేలా ప్రజలు ఎన్నికల్లో తీర్పునిచ్చారు. తమకు నచ్చని వ్యక్తులను, నాయకులను లక్ష్యంగా చేసుకుని తిట్టడానికి మిమల్ని చట్టసభలకు పంపలేదని.. ప్రజల భవిష్యత్తును బాగుచేయడానికి పంపితే.. మీరు సర్వనాశనం చేశారని తెలిసేలా ఏపీ ఓటర్లు (Voters) తీర్పు చెప్పారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. తాము భారీ మెజార్టీతో గెలుస్తామని విర్రవీగిన నేతలు పరాజయం పాలయ్యారు. విపక్షాలపై తిట్లతో విరుచుకుపడ్డ నాయకులను ప్రజలు ఎన్నికల్లో ఓడించారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు పనిచేసినట్లు భవిష్యత్తులో ఎవరూ పనిచేయవద్దని.. ఆచితూచి వ్యవహరించాలని ఓ సందేశాన్నిచ్చారు ఏపీ ప్రజలు. ఏపీలో ఎన్నికల తర్వాత వైసీపీలో కొందరు నేతలు సైలెంట్ అయిపోయారట.
అంతా గప్ చుప్.. ఆ నేతల సైలెంట్ వెనుక అసలు రహస్యం అదేనా..
