రాజధాని అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతిపై కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పెండింగ్ పనులన్నీ వడివడిగా సాగుతున్నాయి. అటు పెట్టుబడుల కోసం ఔత్సాహికులను ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా గతంలో చంద్రబాబుతో టచ్‌లో ఉన్న ప్రతినిధులు అమరావతికి తరలివచ్చి ఆయనతో చర్చలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా.. అమరావతిలో సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సమావేశం అయింది. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనే దానిపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు.
అమరావతి నిర్మాణానికి అండగా ప్రపంచ బ్యాంకు..
