వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల వైయస్ఆర్‌సీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. జగన్ సమావేశం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ప్రజలకు ఇచ్చిన హామీల అమలను చంద్రబాబు సర్కార్ విస్మరించిందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో బహిరంగంగా రాజకీయ హత్యలను, దాడుల్ని చంద్రబాబు, నారా లోకేష్ ప్రొత్సహిస్తూ వస్తున్నారు. ప్రజల గోడు పట్టించుకోకుండా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలు, వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. శిశుపాలుడి వంద తప్పులు త్వరలోనే పూర్తవుతాయని, ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని తప్పుడు సంప్రదాయాలకు చంద్రబాబు తెర లేపాడు.
చిత్తూరు జిల్లా నేతలతో వైయస్ జగన్..
