ఇస్రో వందో ప్రయోగం సక్సెస్‌..

ys-jagan-29.jpg

భారత అంతరి ప్రయోగ సంస్థ ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం విజయవంతం కావ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శాస్త్ర‌వేత్త‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. సూళ్లురుపేట శ్రీహరికోట నుంచి బుధవారం వేకువజామున జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-15 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. సుమారు 2,250 కిలోల బరువున్న ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని అది విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో శాస్త్రవేత్తల‌ను వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. భారతదేశ అంతరిక్ష యాత్రలకు గేట్‌వే అయిన శ్రీహరికోటకు ఆంధ్ర ప్రదేశ్ నిలయం కావడం పట్ల గర్విస్తున్నానని, అంతరిక్ష సాంకేతికతలో ఇస్రో అద్భుతంగా ఉందని వైయ‌స్ జ‌గ‌న్  కొనియాడారు. భవిష్యత్ ప్రయత్నాలలో ఇస్రో విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తూ, అంతరిక్ష పరిశోధనలో ఇస్రో వందో ప్రయోగం చ‌రిత్ర‌లో ఓ మైలురాయిగా నిలుస్తుంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.

Share this post

scroll to top