ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రభుత్వం తీరు బాధాకరం అన్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించ కూడదు అనే తాపత్రయం కనిపించిందని దుయ్యబట్టారు. హోం మంత్రి సహాయచర్యలు పర్యవేక్షణ కోసం వెళుతున్నాను అనే మాటే చెప్పలేదు. ఫ్యాక్టరీలు ఏ శాఖ పరిధిలోకి వస్తుందో పరిశ్రమల మంత్రికి తెలియదు. ఎంత మంది చనిపోయారు తెలియదని చెప్పారు. ఘటనా స్థలానికి అంబులెన్సులు కూడా పంపలేకపోయారు. కంపెనీ బస్సుల్లో బాధితులను తరలించాల్సి వచ్చిందంటు మండిపడ్డారు. అదే, LG పాలిమర్ ప్రమాదం అర్ధరాత్రి జరిగితే కలెక్టర్, పోలీసులు, అంబులెన్సులు సంఘటనా స్థలికి హుటాహుటిన తరలించాం 11 గంటలకు నేను స్పాట్ కు వచ్చాను అని గుర్తుచేసుకున్నారు. కోవిడ్ ఇబ్బందులు అధిగమించి సైతం రెస్క్యూ చేశాం తొలిసారి కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించామన్నారు.
ఫార్మా బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ..
