ఏపీ లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తలకు ఇటీవల కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఇవాళ మాజీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ ధైర్యానికి గర్వంగా ఉందని తెలిపారు. 50 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 39 స్థానాలు గెలిచామని హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి నేతలు అధికార అహకారంతో ఎలాగైనా గెలవాలని చూశారని వైఎస్ జగన్ ఆరోపించారు. నేను రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యమని నమ్ముతానని అన్నారు. ఇక టీడీపీ అధికార దుర్వినియోగంతో భయపెట్టినా వైసీపీ కార్యకర్తలు తెగించారు. సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మాజీ సీఎం జగన్ దుయ్యబట్టారు. ఈ క్రమంలో రాబోయే రోజులు మనవే అని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
