మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని చివరకు ఆయన ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నా మన ప్రభుత్వం సాకులు చూపలేదు. మాట తప్పుకుండా మేనిఫెస్టోనే అమలు చేశాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన మాటకోసం కట్టుబడి పనిచేశాం. ప్రతి ఇంటికీ మించి చేశాం. చేసిన మంచి ఎక్కడికీ పోదు. వచ్చే ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచే మనకు శ్రీరామ రక్ష. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయి. వైయస్ జగన్ పలావు ఇచ్చాడు బాగానే చూసుకున్నాడని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని మోసం చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. పలావు లేదు.. బిర్యానీ లేదు ఇప్పుడు. ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితి.
ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో కూడా మోసమే కనిపిస్తోంది..
