లండన్ లో డిగ్రీ పూర్తి చేసిన తన కూతురు వర్షారెడ్డికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపి తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. కంగ్రాట్స్ డియర్ వర్షా రెడ్డి. ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజీ నుంచి మంచి మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశావు. ఇది మన కుటుంబానికి గర్వకారణం. నీకు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ఇక ముందు ముందు దూసుకు వెళ్లాలి. అంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక ఈ ఫ్యామిలీ ఫోటోలో వైయస్ భారతి, వైయస్ వర్షా రెడ్డి అలాగే హర్ష రెడ్డి తో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.