అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు..

ys-sharmala-19.jpg

APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదని అమిత్ షా పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని పార్టీ నాయకత్వానికి పిలుపునిస్తున్నామని దేశ ప్రజలకు వెంటనే అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు షర్మిల.

తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే దేశ ద్రోహంతో సమానమంటూ ఫైర్‌ అయ్యారు. నిండు సభలో అంబేద్కర్ గారిని హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశ ద్రోహి అన్నారు. దేశ ద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా, క్షమాపణలు చెప్పాలని అడగకుండా, అతిథి మర్యాదలు చేసే వాళ్ళు కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్లేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిల.

Share this post

scroll to top