టీడీపీ 30 రోజుల పాలనపై స్పందించిన కాసు మహేష్ రేడ్డి.. రేపు పల్నాడుకి వైఎస్ జగన్‌..

ys-jagan-18.jpg

రేపు పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో ఫోన్‌ మాట్లాడిన వైఎస్‌ జగన్‌.. రషీద్ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. రేపు తానే స్వయంగా వినుకొండ వస్తానని బ్రహ్మనాయుడికి వైఎస్‌ జగన్‌ తెలిపారు.

30 రోజుల పాలనలో ఏం చేశారు అంటే 3 రేపులు. 30 మర్డర్ లు. 300 మంది పై దాడి. 3000 ఇల్లు పై దాడులు. ఆంధ్రప్రదేశ్ నిన్న వినుకొండలో వైఎస్‌ఆర్‌సీపీ ముస్లిం మైనార్టీ నేతపై టీడీపీ గూండా దాడి చేసి హత్య చేశారని రెండు చేతులు నరికి మెడపై కూడా పదేపదే కత్తితో వేటువేయడంతో రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడని తెలిపింది. కొన ఊపిరితో ఉన్న రషీద్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడని పేర్కొంది. ఈ హింసాత్మాక ఘటనలపై ఇప్పటికైనా వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నామని వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి తెలిపారు.

Share this post

scroll to top