చంద్రబాబు నీతులు చెబుతూనే దాడులను ప్రోత్సహిస్తున్నారు ఎంపీ అవినాష్‌ రెడ్డి..

avinash-reddy-25.jpg

ఏపీలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయి. సీఎం చంద్రబాబు ఒకవైపు నీతులు చెబుతూనే మరోవైపు దాడులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. అలాగే, వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్టీని వీడే అవకాశమే లేదన్నారు. కాగా, కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి నేడు లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ వెళ్లారు.. ఈ సందర్బంగా అవినాష్‌ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కడప పార్లమెంట్ నుంచి వరుసగా మూడోసారి గెలవడం సంతోషంగా ఉంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆశీస్సులు, కడప ప్రజల మద్దతు, కార్యకర్తల కష్టంతో విజయం సాధించాను. నాపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన కడప ప్రజలు నాపై నమ్మకం ఉంచారు. వారి అభివృద్ధి కోసం పనిచేస్తాను.

Share this post

scroll to top