నిన్న నల్ల కండువాతో అసెంబ్లీ సమావేశానికి హాజరైన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మూడు రోజులపాటు అక్కడే ఉండనున్న జగన్.. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు దేశ రాజధానిలో ధర్నా చేయనున్నారు. అలాగే, ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయనున్నారు. నిన్న ఎమ్మెల్యేలతో కలిసి నల్లకండువాలతో సభకు హాజరైన జగన్.. ఆపై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నినాదాలు చేస్తూ అసెంబ్లీని వాకౌట్ చేశారు. ఏపీలో అరాచక పాలన జరుగుతోందని, నెలన్నర రోజులుగా రాష్ట్రంలో హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పతాకస్థాయికి చేరాయని ఆరోపించారు.
దేశ రాజధానిలో జగన్ ధర్నా..
