అదానీ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో జగన్ కు లంచాలు ముట్టాయంటూ షర్మిల మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అదానీ కంపెనీ విద్యుత్ ను కేంద్ర ప్రభుత్వానికి అమ్మితే కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి ద్వారా ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో అదానీ లంచం ఎందుకిస్తారు. అదానీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. షర్మిల పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తుంది. రాజకీయాలను అడ్డు పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చు కోవాలనుకుంటున్నారు. అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు అని చార్జిషీట్ లో ఉంటే ఏకంగా జగన్కు 1,750 కోట్లు లంచం ఇచ్చారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రానికి తక్కువతో విద్యుత్ కొని ఆదా చేస్తే తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు, షర్మిలకు దమ్ముంటే నరేంద్ర మోదీని ప్రశ్నించాలి.
చంద్రబాబుకు, షర్మిలకు దమ్ముంటే నరేంద్ర మోదీని ప్రశ్నించాలి..
