Tag Archives: ycp

టీడీపీకి ఈసీ నోటీసులు

సీఎం జగన్పై రాయి దాడి తర్వాత సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ జనరల్ సెక్రటరీకి సీఈవో నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జై టీడీపీ, తెలుగు దేశం పార్టీ అకౌంట్ల నుంచి జగన్పై అనుచిత పోస్టులు చేశారని సీఈవోకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు.

Read More »

రాయి దాడి కేసు.. నిందితుడి వాంగ్మూలం కోసం పిటిషన్

సీఎం జగన్పై రాయి దాడి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జడ్జి సమక్షంలో నిందితుడు సతీశ్ వాంగ్మూలాన్ని తీసుకునేందుకు అనుమతి కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా నిన్న సతీశు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతడిని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు.

Read More »

నేడు ఉత్తరాంధ్రలోకి జగన్ బస్సు యాత్ర

సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. నేడు ఉత్తరాంధ్రలోకి జగన్ అడుగుపెట్టనున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి నుంచి అనకాపల్లి నియోజకవర్గం మీదుగా పెందుర్తి చేరుకోనున్నారు. సా.3.30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభ ఉండనుంది.

Read More »

నెల్లూరు జిల్లాలో జనసేనకు భారీ షాక్.. వైసీపీలో చేరిన చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి

నెల్లూరు జిల్లాలో టీడీపీ, జనసేనకు భారీ షాక్ తగిలింది. పలువురు కీలక నేతలు ఆ పార్టీలకు గుడ్ బై చెప్పారు. అంతేకాదు వైసీపీలో చేరారు. జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డితో పాటు నెల్లూరు మండల అధ్యక్షుడు కాటం రెడ్డి జగదీశ్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ నేత చేజెర్ల సుబ్బారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో జిల్లాలో ...

Read More »

పవన్ కళ్యాణ్ కు షాక్.. ఇవాళ పిఠాపురంలో అడుగుపెట్టనున్న సీఎం జగన్ !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తన బస్సు యాత్రను కొనసాగించనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. ఈ బస్సు యాత్రలో భాగంగా ఇవ్వాల ఉదయం ఎస్టి రాజపురం రాత్రి బస చేసిన నుంచి బయలుదేరుతారు జగన్. ఆ తర్వాత రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ ...

Read More »

సీఎం జగన్‌పై దాడి కేసు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే ఈ దాడి అంశం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. సీఎం జగన్‌పై దాడి చేయించింది టీడీపీ నేతలేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై పథకం ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదన్నారు. ...

Read More »

ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు.. చంద్రబాబు ఆయనకు షాకిచ్చారు: విజయసాయిరెడ్డి

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయాలను నాయకులు రక్తికట్టిస్తున్నారు. టీడీపీ పేరు వింటేనే విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో పచ్చపార్టీ ఆ టికెట్‌ను వేరొకరికి ఇచ్చిందని ఆరోపించారు. దీంతో ...

Read More »

నంద్యాలలో జనసేనకు బిగ్ షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత

ఎన్నికల వేళ రాష్ట్రంలోని జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. నంద్యాలకు చెందిన కీలక నేత, జనసేన కోఆర్డినేటర్ విశ్వనాథ్ ఈ రోజు వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అతను.. పొత్తులో భాగంగా.. టికెట్ దక్కక పోవడంతో కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనను పార్టీలోకి శిల్పా మోహన్ రెడ్డి ఆహ్వానించనున్నారు. కాగా ఈ సమయంలో విశ్వనాథ్ వెంట భారీగా జనసేన నాయకులు కూడా వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని ...

Read More »

నేడు 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర..షెడ్యూల్ ఇదే

మేమంతా సిద్ధం – 17వ రోజు షెడ్యూల్ విడుదల అయింది. నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్‌ ఇచ్చిన సీఎం జగన్‌… ఇవాళ మళ్లీ ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు సీఎం జగన్‌. అనంతరం తణుకు,రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి ...

Read More »

జగన్ కోసం మానవ బాంబునవుతా: MLA అభ్యర్థి

టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ను చంపాలని చూస్తే మానవ బాంబుగా మారేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తనలాంటి వారు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్పై దాడిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగనన్ను ఏం చేయాలనుకుంటున్నారని దువ్వాడ ప్రశ్నించారు.

Read More »