నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు..

cbn-7.jpg

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన నేత కళను ప్రపంచానికి అందించిన చేనేత కార్మికులు మన దేశ ప్రతిష్టను పెంచారని ఆయన ప్రశంసలు కురిపించారు అలాంటి చేనేత కార్మికులను ప్రోత్సహించడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా చేనేత రంగానికి అండగా నిలిచి నేతన్నలకు భరోసా ఇస్తామన్నారు. సమగ్ర చేనేత విధానం తీసుకువచ్చి, సబ్సిడీలు పునరుద్ధరించి చేనేత కుటుంబాలను, చేనేత రంగాన్ని నిలబెడతామని చెప్పారు. వెలకట్టలేని నైపుణ్యం, సృజనాత్మకతకు నెలవైన చేనేతకు పునర్వైభవం తీసుకువస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Share this post

scroll to top