అమరావతి పునఃనిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనులు స్పీడప్ చేస్తోంది. ఇందులో భాంగంగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఇవాళ ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ముఖ్యంగా సీఆర్డీఏ ఆధారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు పాలనపరమైన అనుమతులపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. అలాగే విజయవాడ బుడమేరు ముంపు బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపు, పలు పరిశ్రమలకు భూ కేటాయింపుల లాంటి అంశాలు కూడా కేబినెట్‌లో చర్చకు రానున్నాయి.
అమరావతిపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్..
