కొబ్బరి కాయ పోషకాల పుట్టగా చెప్పొచ్చు. కొబ్బరి నీళ్లు, కొబ్బరి ముక్కలు, కొబ్బరి పువ్వు, కొబ్బరి నూనె ఇలా వీటి ద్వారా అనేక పోషకాలు లభిస్తాయి. చర్మానికి, జుట్టుకు రక్షణగా నిలుస్తాయి. చాలా మంది దగ్గు వస్తుందని కొబ్బరి తినరు. కానీ కొబ్బరి తినడం వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. కొబ్బరి మాత్రమే కాకుండా కొబ్బరి కాయల్లో వచ్చే పువ్వులో కూడా అనేక పోషకాలు లభిస్తాయి. సాధారణంగా గుడిలో కొబ్బరి కాయను కొట్టినప్పుడు పువ్వు వస్తే ఎంతో సంతోషిస్తాం. అలాగే కొబ్బరి పువ్వు కనిపిస్తే ఏమాత్రం ఆసల్యం చేయకుండా ఇంటికి తెచ్చుకుని తినండి.
ఈ కొబ్బరి పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారసైట్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో చక్కగా పని చేస్తాయి. ఇమ్యూనిటీ పెరగడం వల్ల వ్యాధులు, ఇన్పెక్షన్లు రాకుండా ఉంటాయి. కొబ్బరి పువ్వు తినడం వల్ల జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటుంది. చర్మంపై ముడతలు, మచ్చలు కూడా ఉండవు. జుట్టు కూడా దృఢంగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయ పడుతుంది.