ఏపీ లిక్కర్ స్కామ్‌పై మాజీ ఎంపీ కేశానేని నాని వేదికగా చేసిన ట్వీట్ పొలిటికల్‌గా హీట్ పుట్టిస్తోంది. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి, దిలీప్పైలాతో విజయవాడ ఎంపీ చిన్నికి సంబంధం ఉందని నాని ఆరోపించారు. కేసిరెడ్డి, ఎంపీ కేశినేని చిన్నితో అతని భార్యతో కలిసి ప్రైడ్ఇన్ఫ్రాకాన్ కంపెనీలో భాగస్వామిగా ఉందని తెలిపారు. ఆ కంపెనీ హైదరాబాద్‌లో ఉందని కేసిరెడ్డి, దిలీప్ నిర్వహిస్తున్న ఏషన్వి ఇన్‌ఫ్రా ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్‌కూడా సేమ్ అదే చిరునామా కలిగి ఉందని కామెంట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సిట్టింగ్ ఎంపీ చిన్నితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వచ్చిన అక్రమ సొమ్మును విదేశాలకు తరలించారని నాని ఆరోపించారు.
ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను ఎంపీ చిన్ని కొట్టిపడేశారు. ఆయన చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీలో ఉంటూ వైసీపీ అధినేత జగన్‌కు కొమ్ముకాసిన వ్యక్తి నాని అంటూ చిందులు తొక్కారు. తమ సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉండటంతో కలిసిన నిర్మాణ పనులు చేపట్టేందుకు 2021లో రిజిస్టర్ అయిన సంస్థ అది అని తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాకముందే కేసిరెడ్డితో సంస్థతో తెగతెంపులు చేసుకున్నానని అన్నారు. అందుకు తాను చాలా నష్టపోయానని పేర్కొన్నారు. విదేశాల్లో పెట్టుబడులు అంటూ నాని చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. దమ్ముంటే తనకు, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా నిరూపించాలని చిన్ని ఫైర్ అయ్యారు.