ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్‌..

rain-06.jpg

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోతంది. రాష్ట్రంలో 41 – 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అయితే మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడొచ్చని తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు, 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. అలాగే విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.

Share this post

scroll to top