ప్రస్తుతం టీ, కాఫీ తాగే అలవాటు అత్యధిక మందికి ఉంటోంది. కాఫీ, గ్రీన్ టీ ఈ రెండింటిలో హెల్త్ పరంగా ఏది బెస్ట్, గుండెకు ఏది మేలు చేస్తుంది అనే అంశంపై ఓ తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బుల బాధితులు పెరుగుతున్నారు. కాఫీ, గ్రీన్ టీ ఈ రెండు తాగేవారిలో మొత్తం ఆరోగ్యాన్ని, గుండె ఆరోగ్యాన్ని ఏది ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు ఓ అధ్యయనం నిర్వహించారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లోనూ ఇది పబ్లిషైంది.
స్టడీలో భాగంగా పరిశోధకులు 18 వేలమంది కాఫీ, అలాగే గ్రీన్ టీ తాగే అలవాటు గలవారిని అబ్జర్వ్ చేశారు.అవి వారి గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేశాయో పరిశీలించారు. అయితే ఈ సందర్భంగా వారు రెండు కాఫీలో సుమారు 95 నుంచి 200 మి. గ్రా. కెఫిన్ ఉంటుందని, గ్రీన్ టీ లో 35 మి. గ్రా కెఫిన్ ఉంటుందని గుర్తించారు. కాగా గ్రీన్ టీ కంటే కాఫీలో సుమారు మూడు రెట్లు అధికంగా కెఫిన్ ఉంటున్నట్లు నిర్ధారించిన పరిశోధకులు అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కాఫీని ఎక్కువగా తాగడం గుండె ఆరోగ్యంపై హానికర ప్రభావం చూపుతుందని, తక్కువగా తాగితే అలాంటి సమస్య ఉండదని వెల్లడించారు. అలాగే కాఫీతో పోలిస్తే గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి మంచిదని, ఇందులో పాలీఫెనాల్ అనే కంటెంట్ హానికరమైన కెఫిన్ ప్రభావాలను కూడా తొలగిస్తుందని పేర్కొన్నారు.