అల్లు అర్జున్ ప్లానింగ్‌కు మైండ్ బ్లాక్.. 

allu-arjun-31-.jpg

అట్లీతో చేయబోయే సినిమా జోనర్ ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు రాలేదని తెలుస్తుంది. ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్‌తో యాక్షన్ జోనర్‌లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. సమ్మర్ తర్వాత రెగ్యులర్ షూట్ మొదలు కానుంది.ఇక అట్లీ సినిమాతో కొత్త జోనర్ ట్రై చేస్తున్న బన్నీ త్రివిక్రమ్ కోసం మరో జోనర్‌లోకి వెళ్లనున్నారు. ఇప్పటి వరకు కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా మైథలాజికల్ సినిమా చేయబోతున్నారు బన్నీ, గురూజీ.ఈ కాంబో అంటే ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ఈసారి ఇంకాస్త భారీగా ప్లాన్ చేస్తున్నారు ఈ కాంబో. అట్లీ సినిమా బడ్జెట్ 500 కోట్లకు పైనే ఉండబోతుంది. విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అయితే మైథలాజికల్ జోనర్‌లో నెవర్ బిఫోర్ అన్నట్లు ఉండబోతుంది. తను చేయబోయే నెక్ట్స్ రెండు సినిమాలు డిఫెరెంట్ జోనర్స్ ట్రై చేస్తూ కమర్షియల్‌గానూ సక్సెస్ అయ్యేలా డిజైన్ చేసుకుంటున్నారు అల్లు వారబ్బాయి.

Share this post

scroll to top