కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ..

cbn-28.jpg

తెలంగాణ గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్ ఏపీ రాష్ట్రానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో కలవనున్న నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఈరోజు గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరారు. ఈ క్రమంలో రాధాకృష్ణన్‌కు విమానాశ్రయంలో గుంటూరు ఆర్డీఓ శ్రీకర్ సహా పలు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. దీంతో ఈ భేటీ ఎందుకని పలు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ సమావేశం మర్యాదపూర్వకమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ బేటీ సందర్భంగా ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న విభజన సమస్యల గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయేలో టీడీపీ కింగ్‌మేకర్‌గా ఉంది. ఈ క్రమంలో అవిభక్త రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణను ఏర్పాటు చేయడం ద్వారా నష్టపోయిన అంశాల గురించి కూడా ప్రస్తావించనున్నారు. ఆదాయాన్ని భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది.

గత కొన్నేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 (APRA)కి సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన పూర్తైన 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన అస్పష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం తర్వాత ఇరు రాష్టాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అనేది చూడాలి

Share this post

scroll to top