తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై పెరిగిన ఉత్కంఠ.

sajalla-copy.jpg

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయిన పలు అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉండడంతో పాలనా పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. 6గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.

సమావేశంలో చర్చించే 10అంశాలు ఇవే..

ఏపీ విభజన చట్టం 9వ షెడ్యూల్‌లో పెండింగ్‌లో ఉన్న 23సంస్థల పంపిణీ, 10వ షెడ్యూల్‌లో పెండింగ్‌లోని 30సంస్థల పంపిణీపై చర్చించనున్నారు. అలాగే షీలా బీడే కమిటీ సిఫార్సులపైనా చర్చ సాగనుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి రావాల్సిన రూ.7,200వేల కోట్ల విద్యుత్ బకాయిలపైనా, ఏపీఎఫ్సీ అంశాలపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఉద్యోగుల పరస్పర బదిలీ, లేబర్ సెస్ పంపకాలు.. ఏపీ, తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చులు చెల్లింపులపైనా చర్చిస్తారు. హైదరాబాదులోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య 10ఏళ్లుగా సంస్థల విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పలు సంస్థలకు చెందిన రూ.8వేల కోట్లు రెండు రాష్ట్రాలూ వాడుకోలేకపోతున్నాయి. 9వ షెడ్యూల్‌లోని ఏపీ జెన్కో విలువ రూ.2,448కోట్లుగా నిర్ధారించారు. అత్యల్పంగా ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ మార్క్ ఫెడ్ విలువ ఉంది. 10వ షెడ్యూల్‌లోని సంస్థల్లోనూ రూ.2,994కోట్ల నగదు ఉంది. అందులోని రూ.1,559కోట్లను ఇప్పటికే రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. మిగిలిన రూ.1,435కోట్ల పంపిణీ అంశం పెండింగ్‌లో పడింది. దీంతో ఆ అంశాలన్నింటిపైనా చర్చ జరగనుంది.

Share this post

scroll to top