మరో ఫిరాయింపు ఎమ్మెల్సీ అనర్హత పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. వ్యక్తిగతంగా శాసనమండలి చైర్మన్ ఎదుట హాజరై పార్టీ మారడంపై వివరణ ఇవ్వాలని ఇందుకురి రఘురాజును మండలి చైర్మన్ ఆదేశించారు. విచారణ తదనంతరమే ఆయన అనర్హతపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన రఘురాజుపై వైఎస్సార్‌సీపీ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వ్యక్తిగతంగా మే 27 న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించారు. దీంతో.. రఘురాజు, చైర్మన్ ఎదుట వివరణ ఇవ్వాల్సి ఉంది.