ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఒకట్రెండు కేసులు నమోదు కాగా.. తాజాగా నానిపై గుడివాడ-02 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతా రెడ్డిలపై కేసు నమోదు అయ్యింది. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నాని సహా మిగిలిన వారిపై 448,427,506 ఆర్ అండ్ డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
కొడాలి నానికి మరో బిగ్ షాక్..
