బాబు గారు.. నరేంద్ర మోదీతో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి.. 

ys-sharmala-08.jpg

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ట్విటర్‌ వేదిక ద్వారా డిమాండ్ చేశారు. విభజన హామీలపై క్లారిటీ ఇప్పించాలని, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోదీతో చెప్పించాలని కోరారు. మోదీ కోసం మీరు ఎదురు చూస్తుంటే, ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందని తెలిపారు. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే చేతలకు దిక్కులేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరు కలిసి ఆటకెక్కించారని మండిపడ్డారు.

Share this post

scroll to top