ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళుతున్నారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. నాలుగో పర్యటనకు నేడు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో హెలీప్యాడ్ నుంచి హెలీకాప్టర్ ద్వారా విజయవాడ ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. అక్కడి మధ్యాహ్నం 2.10 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 2.15 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.
నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు..
