వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాకినాడ పోర్టులో వాటాల బదిలీ వ్యవహారంలో కేవీరావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డిపై 506,384, 420,109,467,120(b)రెడ్ విత్ 34 BNS సెక్షన్లు నమోదు చేశారు. ఈ నెల 12న మంగళగిరి లోని సీఐడీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే సీఐడీ జారీ చేసిన నోటీసులను విజయసాయిరెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి విజయసాయిరెడ్డి విచారణకు వెళతారా?, సమయం కోరతారా? అనేది చూడాల్సి ఉంది.
విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు..
